కార్మికుల కష్టాలు పట్టవా ?
ఆర్థిక లావాదేవీల గొడవలతో రెండు కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుకు వెళ్లటంతో కార్మికుల జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కార్మికుల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలి. కుటుంబ పోషణకు శానిటరీ పనులు చేసే కార్మికులను పండుగ రోజుల్లో పస్తులు ఉంచటం దారుణం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వందలాది కార్మిక కుటుంబాల ఆకలితో అలమటించే దుస్థితి నెలకొంది.
– కె.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు,
ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ యూనియన్
పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తోన్న పేద కుటుంబాలపై అధికారులు మానవత్వం చూపించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసే శానిటరీ వర్కర్లకు మాత్రం శాపంలా మారింది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుల్లో కేసులు వేసుకుని, కార్మికులను ఇబ్బందులకు గురిచేయటం దారుణం. పీఎఫ్ బకాయిలు సైతం 18 నెలలుగా ఇవ్వకుండా మోసం చేశారు.
– తుర్లపాటి బాబు, చింతలపూడి ఏరియా కార్యదర్శి, ఏఐటీయూసీ
కార్మికుల కష్టాలు పట్టవా ?


