అయోమయంగా ఉపాధి పనులు
ముసునూరు మండలంలో పనులు చేయకుండానే ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులు చర్చనీయాంశంగా మారింది. సామాజిక తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. 8లో u
ఏలూరు (టూటౌన్): బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గత డిసెంబర్ 3 నుంచి 100 రోజులపాటు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కోసం గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనే సీతారాం పాల్గొన్నారు.


