మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి.. | - | Sakshi
Sakshi News home page

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

Dec 28 2025 8:26 AM | Updated on Dec 28 2025 8:26 AM

మృత్య

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

ఆధారంగా ఉంటాడనుకుంటే..

వద్దన్నా వినలేదు

తమ్ముడి బైక్‌ తీసుకుని..

ద్వారకాతిరుమల: తమకు ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు మృత్యువాత పడటం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.. ఇప్పుడే వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నపేగు కన్నీళ్లు పెడుతోంది.. దేవుడా ఇంత అన్యాయం చేశావేంటయ్యా.. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్నామంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ద్వారకాతిరుమల, తిమ్మాపురం గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమలకు చెందిన సయ్యద్‌ రఫీ (22), కొయ్యగూర శ్రీరామ్‌ (బన్నీ)(21), తిమ్మాపురానికి చెందిన మాండ్రాజు చరణ్‌ (25) స్నేహితులు. వీరంతా స్థానికంగా డెకరేషన్‌ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమలలో జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్‌ కోసం పూలు కొనేందుకు చరణ్‌ తమ్ముడు రాజేష్‌కు చెందిన బైక్‌పై వీరు ముగ్గురు శుక్రవారం రాత్రి ఏలూరు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో చరణ్‌కు రాజేష్‌ ఫోన్‌ చేసి ఎక్కడున్నావని అడగ్గా, వచ్చేస్తున్నానని చెప్పాడు. ఎంతకీ రాకపోయే సరికి శనివారం వేకువజామున 4 గంటలకు రాజేష్‌ మళ్లీ ఫోన్‌ చేశాడు. అయితే ఆ ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కానిస్టేబుల్‌ భీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్‌, మరో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని చెప్పారు. బైక్‌ చరణ్‌ నడుపుతున్నట్టుగా నిర్ధారించారు. ఇది లా ఉంటే పోలీసులు మరో మృతుడు శ్రీరామ్‌ ఫోన్‌ తీసి, అతడి ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా లాక్‌ తీసి, పూల డెకరేషన్‌ యజమాని మొయ్యే శివకు సమాచారం అందించారు. దీంతో ద్వారకాతిరుమల, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మృతుల స్నేహితులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం ఆంబులెన్స్‌లో గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్నేహితులు భారీ బైక్‌ ర్యాలీతో ఇళ్లకు చేర్చారు.

కంగారుగా వెళుతూ.. ప్రమాదానికి గురై..

తన అన్న కుమారుడు శ్రీరామ్‌ మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కొయ్యగూర రవి కంగారుగా బైక్‌పై భీమడోలు వెళుతుండగా కుక్క అడ్డురావడంతో కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలో శ్రీరామ్‌ కొన ఊపిరితో ఉన్నట్టు తనకు తెలిసిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే బతుకుతాడన్న ఆశతో వెళుతుండగా ప్రమాదం జరిగిందని రవి చెప్పాడు. అయితే ఘటనా స్థలానికి అంబులెన్స్‌ చేరుకున్న తరువాతే శ్రీరామ్‌ మృతి చెందాడని అన్నాడు.

తల్లిదండ్రుల ఆశలు ఆవిరి

చేతికందొచ్చిన కొడుకులు దూరం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

తిమ్మాపురం, ద్వారకాతిరుమలలో విషాద ఛాయలు

సయ్యద్‌ రఫీ తల్లిదండ్రులు షేక్‌ సలీమా, షుకూర్‌లు 20 ఏళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. సలీమా స్థానికంగా ఓ చెప్పుల షాపులో పనిచేస్తోంది. 10వ తరగతితో చదువు మానేసిన రఫీ పూల డెకరేషన్‌ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డెకరేషన్‌ పనికి వెళుతున్నట్టు రఫీ తన తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారే సరికి కొడుకు మరణవార్త విని సలీమా కుప్పకూలిపోయింది. ఆధారంగా ఉంటాడనుకున్న కొడుకు దూరమయ్యాడంటూ తల్లడిల్లిపోతోంది.

కొయ్యగూర సుబ్బారావు, కుసుమకుమారి దంపతులకు శ్రీరామ్‌ రెండో సంతానం. డిగ్రీ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్‌ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పాడు. తల్లి కుసుమ కుమారి, అక్క శిరీష వద్దన్నా వినకుండా.. వెంటనే వచ్చేస్తానంటూ వెళ్లాడు. తిరిగి విగతజీవిగా ఇంటికి చేరాడు. శ్రీరామ్‌ అకాల మరణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు.

మండ్రాజు సర్వేశ్వరరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం కాగా చరణ్‌ పెద్దవాడు. ఇంటర్‌ మధ్యలో ఆపేసి పూల డెకరేషన్‌ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి తమ్ముడి కొత్త బైక్‌ను తీసుకుని రఫీ, శ్రీరామ్‌ లతో కలసి ఏలూరు వెళ్లాడు. అదే బైక్‌ నడుపుతూ ప్రమా దానికి గురై మృత్యువాత పడ్డాడు. వీరి కుటుంబానికి తెల్లవారు 4 గంటలకు విషయం తెలియగా.. బంధువులతో పాటు తిమ్మాపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి.. 1
1/4

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి.. 2
2/4

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి.. 3
3/4

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి.. 4
4/4

మృత్యువు మాటేసి.. తీరని శోకాన్ని మిగిల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement