ఇనుమూరు గిరిజనులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని, గిరిజన భూసమస్యలు పరిష్కరించి న్యాయం చే యాలని ఆదివాసీ గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇనుమూరు గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. శనివారం ఏ లూరు అన్నే భవనంలో ఏపీ రైతు సంఘం జి ల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరా వు, సీపీఐ జిల్లా నాయకుడు కన్నబాబు, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి నాగరాజు, ఆల్ ఇండియా లా యర్స్ యూనియన్ జిల్లా నాయకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి నా ట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణకు ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 3 నుంచి గుంటూరులో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాల్లో కేవీఎస్‌కు పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.


