విద్యారంగానికి గడ్డుకాలం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి గడ్డుకాలం

Dec 28 2025 8:26 AM | Updated on Dec 28 2025 8:26 AM

విద్య

విద్యారంగానికి గడ్డుకాలం

ప్రభుత్వ స్థలాలపై కన్ను

పట్టిసం ఉత్సవాలపై సమావేశం

అమ్మకు ఎగనామం

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ స్థలాలపై కన్ను
పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. 8లో u
విద్యారంగం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.. విద్యారంగంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడం విమర్శలకు తావిస్తోంది.. పాఠశాలల అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడకపోవడం, విద్యార్థి మిత్ర పథకంలో ఇచ్చిన స్కూల్‌ బ్యాగులు నాణ్యత లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, తల్లికి వందనంలో కోతలు, ఉపాధ్యాయులపై బోధనేతర భారం, డీఏల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం.. మొత్తంగా 2025లో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది.

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెండేళ్లుగా విద్యారంగం అత్యంత గడ్డు పరిస్థితులను చూస్తోంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యారంగంలో కూడా అవినీతి పేరుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో సర్వేపల్లి రాధాకష్ణన్‌ విద్యార్థిమిత్ర పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేసిన స్కూల్‌ బ్యాగులు నాణ్యత లేక రెండు నెలలకే చిరిగిపోయాయి. అలాగే నాణ్యత లేని బూట్లు ఇప్పటికే పాడైపోవడంతో విద్యార్థులు చెప్పులతోనే తరగతులకు హాజరవుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ట్యాబ్‌ కూడా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నా యి. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ విద్యారంగంపై మమకారం చూపుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హామీల అమలెప్పుడో..?

ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను 2025లోనూ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకూ నూతన కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్‌ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే డీఏల చెల్లింపుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైలో ఇవ్వాల్సిన డీఏల బకాయిలు ఉన్నాయి. నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ అంటే మొత్తంగా నా లుగు డీఏలను ప్రభు త్వం చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు.

గురువులకు

బోధనేతర భారం

ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడం ద్వారా విద్యార్థులను విద్యాభ్యాసానికి ప్రభుత్వం దూరం చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యాప్‌ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరిన్ని యాప్‌ల భారాన్ని మోపింది. హాజరు నమోదు, ఇన్‌స్పెక్షన్‌, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి ఇలా పలురకాల యాప్‌ల బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు పేరెంట్‌ టీచర్స్‌ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. గురువులు తమ జేబుల్లోని సొమ్ములను సమావేశాల కోసం వెచ్చించాల్సి వస్తోంది.

నిర్మాణాలు ఎక్కడికక్కడే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2025లో జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

పేదలకు ఉన్నత చదువులు దూరం

పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిమిత్తం చెల్లించలేదు. రెండో ఏడాది 2025లో అయినా నిధులు విడుదల చేస్తుందని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదల చేసినట్టు ప్రచారం చేసుకుంది. అయితే వాస్తవంగా చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తొలి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. 8లో u

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం సాయాన్ని ఎగ్గొట్టింది. తీవ్ర విమర్శలు రావడంతో 2025లో పథకాన్ని అమలు చేసినా నిధుల్లో భారీగా కోత విధించింది. జిల్లాలో 2,44,113 మంది తల్లులకు రూ.366.17 కోట్లు జమచేసినట్టు చెబుతున్నా అదంతా బూటకమనే విమర్శలు ఉన్నా యి. కొందరు తల్లులకు రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే తల్లుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి తల్లులకు పంగనామం పెట్టింది.

ప్రభుత్వ విద్య.. అంతా మిథ్య

పాఠశాలల అభివృద్ధి పట్టని ప్రభుత్వం

గురువులకు ఇచ్చిన హామీలు గాలికి..

బోధనేతర పనులతో ఒత్తిడి

‘తల్లికి వందనం’లో కోతలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం

2025లో విద్యారంగం అస్తవ్యస్తం

విద్యారంగానికి గడ్డుకాలం 1
1/3

విద్యారంగానికి గడ్డుకాలం

విద్యారంగానికి గడ్డుకాలం 2
2/3

విద్యారంగానికి గడ్డుకాలం

విద్యారంగానికి గడ్డుకాలం 3
3/3

విద్యారంగానికి గడ్డుకాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement