ట్రిపుల్‌ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
నూజివీడు: ఎనిమిదేళ్లుగా జీతాలను పెంచకుండా ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం తమకు తీరని అ న్యాయం చేస్తోందని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొ ఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు 6వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతనాన్ని ఫిక్స్ చేశారని, చివరిసారిగా 2018లో జీతాలను పెంచారన్నారు. అప్పటినుంచి జీతాలు పెంచకపోవడంపై ట్రిపుల్‌ఐటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 2010–14 కాలంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంతమంది చేరారు, వారి నియామకం ఎలా జరిగిందనే వాటికి సమాధానం ఇవ్వమని ప్రభుత్వం కోరినా ట్రిపుల్‌ఐటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా సమాధానం రాసి ప్రభుత్వానికి పంపకుండా జాప్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సూచన మేరకు రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శనను వాయిదా వేసుకున్నామని, అయినా ఉన్నతాధికారులను కలిసే అవకాశం రా లేదని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్‌లను ఆర్జీయూకేటీ పరిష్కరించాలని కోరారు.


