దళిత సర్పంచ్‌పై టీడీపీ మూకల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ రౌడీ మూకలు దళిత సర్పంచ్‌పై దాడికి తెగబడ్డారు. బాధిత సర్పంచ్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాడు మండలం ఏపూరి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ శనివారం ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లొస్తుండగా టీడీపీ నేతలు అడ్డగించారు. రామకృష్ణ బైక్ నంబర్ ప్లేట్‌పై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఫొటోలు చూసిన టీడీపీకి చెందిన కొసరాజు వంశీ, అతని స్నేహితుడు బైక్ నుంచి రామకృష్ణను కిందకు లాగి కాళ్లతో తన్ని గాయపర్చారు. అలాగే అసభ్య పదజాలంతో దూషించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణ పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏలూరు(మెట్రో): పోలవరం ఆర్‌అండ్‌ఆర్ భూ సేకరణకు భూమి గుర్తింపు పనులు నెల రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం సాయంత్రం ఆర్‌అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై జూమ్ ద్వారా అధికారులతో సమీక్షించారు. భూసేకరణకు సంబంధిత గ్రామాల్లో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలన్నారు. మోదెలులో సెల్‌ఫోన్ ట వర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బీఎస్ ఎన్‌ఎల్ అధికారులను ఆదేశించారు. దొరమామిడిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీకి సూచించారు. ఎన్‌హెచ్–165, గ్రీన్‌ఫీల్డ్ హైవే, జీలుగుమిల్లి–పట్టిసీమ, పెడన–లక్ష్మీపురం, పట్టిసీమ–గూటాల రహదారుల భూసేకరణ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. జేసీ అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అ భిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓలు ఎం.అచ్యుత అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్ లో అభినయ నృత్యభారతి సంస్థ 30వ వార్షిక జా తీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు రెండో రోజు శనివారం ఆకట్టుకున్నాయి. టి.కావ్యారా వు (హైదరాబాద్) భరతనాట్యం, నిధికా లూంభా (బెంగళూరు) కథక్, వైష్ణవి మార్గం (వరంగల్) కూచిపూడి, రామ కౌండిన్య శ్రీభాష్యం (శ్రీకాకుళం)కూచిపూడి, ఛార్మిళా వెంకట్ (హైదరాబాద్) కూచిపూడి నృత్యాలతో అలరించారు. వీరందరికీ సంస్థ నిర్వాహకులు నృత్యకౌముది పురస్కారాలు అందించి సత్కరించారు. వీరితో పాటు సేవామూర్తులు ఆ లపాటి నాగేశ్వరరావు (మానవత సేవలు), బీవీ రమణ మూర్తి (విద్యారంగం), ఎంఎస్ చౌదరి (సినీ, నాటక రంగం), కమ్ముల ఆదినారాయణ (యోగా గురువు), పిలగల కొండలరావు (ప్రభుత్వసేవలు), లయన్ చిల్లపల్లి రామమోహనరావు (లయనిజం), ఎస్‌ఎం ఖాసీం ( సంగీతం), సాలా భోగేశ్వరరావు (సామాజిక సేవ), సాతుపాటి శ్యాంబాబు (స్వచ్ఛంద సేవలు)లకు సేవా తపస్వి అవార్డులు అందించినట్టు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేహసుందర్ తెలిపారు.
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రాక మొదలవగా క్షేత్ర పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం ఇతర విభాగాల వద్ద రద్దీ కనిపించింది.
దళిత సర్పంచ్‌పై టీడీపీ మూకల దాడి
దళిత సర్పంచ్‌పై టీడీపీ మూకల దాడి


