భూ సమస్యల పరిష్కారంలో విఫలం
ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి విఫలమైంది. 1/70, ఎల్‌టీఆర్ కింద నమోదైన భూముల్లో గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటుంటే గిరిజనులకు న్యాయం చేయకపోగా గిరిజనేతరుల పక్షాన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉంటూ గిరిజనులపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. కోర్టు వివాదాలు, ఎల్‌టీఆర్, 1/70 పరిధిలో ఉన్న భూములను ఆర్ అండ్ ఆర్ భూములుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – తెల్లం రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు, బుట్టాయగూడెం


