మరియ తనయ.. కరుణ హృదయ
ఏలూరు మన్నా చర్చిలో కొవ్వొత్తులతో ప్రార్థనలు
కరుణ, శాంతి, సహనానికి ప్రతీక క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ క్రైస్తవ మందిరాలు కాంతులీనాయి. క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, ఏసు జనన వృత్తాంతాన్ని తెలిపే సెట్టింగులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాగా.. విశ్వాసులు చర్చిల్లో కేక్ కటింగ్‌లు, గీతాలాపనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు


