ఏసు బోధనలు అనుసరణీయం
డీఎన్నార్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కైకలూరు : మానవాళికి ఏసు బోధనలు అనుసరణీయమని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బుధవారం చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబానికి దీవెనలు కలగాలని ఆకాంక్షించారు.
ఏలూరు (టూటౌన్): సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ టౌన్–వికారాబాద్ మధ్య వచ్చే నెల 19న, వికారాబాద్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 20న, నాందేడ్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 12న, కాకినాడ టౌన్–నాందేడ్ మధ్య వచ్చే నెల 13న ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. మచిలీపట్నం–వికారాబాద్ మధ్య వచ్చే నెల 11 నుంచి 18 మధ్య, వికారాబాద్–మచిలీపట్నం మద్య వచ్చే నెల 11 నుంచి 18 మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. కాకినాడ టౌన్–మైసూర్ మధ్య వచ్చే నెల 16, 19, 23, 26, 30 మధ్య సోమ, శుక్రవారాల్లో ఐదు సర్వీసులు నడుస్తాయన్నారు. మైసూర్–కాకినాడ టౌన్ మధ్య వచ్చే నెల 17, 20, 24, 27, 31 తేదీల్లో మంగళ, శనివారాల్లో ఐదు సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


