సైన్స్ ఫెయిర్‌లో ప్రథమ స్థానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో జిల్లాకు చెందిన విద్యార్థినిలు ప్రథమ స్థానంలో నిలిచారు. విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో చాటపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సువ్వా శరణ్య, బండారు గాయత్రిలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికాలు అంశంపై ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టు అధికారులు మన్ననలు పొంది రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. విద్యార్థినిలు వచ్చే జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించే దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెస్టివల్‌కు అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్ ప్రదర్శనకు ఎంపికయ్యారు. ప్రాజెక్టును ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, టాటా కంపెనీ ప్రతినిధులు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆచార్యులు, ఏలూరు జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.


