
‘గ్రీన్‌ఫీల్డ్’ భూ నిర్వాసితుల గళం
ఏలూరు (టూటౌన్): గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, సర్వీసు రోడ్లను పునరుద్ధరించాలని కోరుతూ బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మా ట్లాడారు. ఈనెల 4న కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైవే అథారిటీ అధికారులు, భూసేకరణ అధికారులు తుంగలోకి తొక్కడం దారుణమన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్వీస్ రోడ్లను తారు రోడ్లుగా నిర్మాణం చేయాలని కోరారు. వచ్చేనెల 2న జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. భూసేకరణలో అతి తక్కువ పరిహారం ఇవ్వడం వలన రైతులు నష్టపోయారని న్యాయం చేయాలని కోరారు. వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం : నరసాపురంలో వశిష్ట గోదావరి శాంతించింది. నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహించగా సోమవారం నీటిమట్టం భారీగా తగ్గింది. అలాగే వలంధర్‌రేవు, లలితాంబఘా ట్, పడవలరేవు ప్రాంతాల్లో నీటిమట్టం సా ధారణ స్థాయికి చేరింది. పడవలరేవులో ఐదు రోజులుగా నిలిచిపోయిన పంటు రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో పెద్ద ఎత్తున జనం పంటుపై రాకపోకలు సాగించారు.