
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు.
కై కలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు జిల్లా, కలిదిండి, సానారుద్రవరం రంగా విగ్రహాలను పేడతో అవమానించిన దుండగులను పట్టుకోడానికి పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో 5 ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతోన్నాయి. ఇప్పటికే సీసీ పుటేజ్‌లను పోలీసులు సేకరించారు. మొత్తం 10 మంది పోలీసు ఉన్నతాధికారులు, 30 మంది పోలీసు సిబ్బంది కేసు చేధించే పనిలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలిదండి సమీప గ్రామాలకు చెందిన యువకులే ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కొంత మంది అనుమానితులను కై కలూరు పోలీసు స్టేషన్‌లో విచారిస్తోన్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రానికి కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఐ వి.రవికుమార్ ఆదివారం చెప్పారు.
ఆకివీడు: ఉప్పుటేరు వంతెన వద్ద శనివారం రాత్రి స్థానిక శ్రీరాంపురానికి చెందిన మజ్జి గాంధీ(57) అనే వ్యక్తి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా వంతెన సమీపంలో మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి శనివారం రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఉప్పుటేరు వంతెనపై అతని సైకిల్ కన్పించడంతో దూకేసి ఉంటాడని భావిస్తున్నారు. ఏఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు