కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో ! | - | Sakshi
Sakshi News home page

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

Aug 24 2025 8:16 AM | Updated on Aug 24 2025 8:16 AM

కుయ్‌

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

ప్రాణాలతో చెలగాటం కొత్త వాహనాలు కొనాలి

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ప్రభుత్వం వెంటనే 108 అంబులెన్స్‌లను అదనంగా ఏర్పాటు చేయాలి. తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించేందుకు 108కు ఫోన్‌ చేస్తే ఎవరూ స్పందించటం లేదు. ఏలూరులో సైతం సంఘటనా స్థలానికి చేరుకోవటానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుంది. గతంలో 108 అంబులెన్స్‌ 10 నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకుని క్షణాల్లో హాస్పిటల్స్‌కు చేర్చటంతో ప్రాణాలు రక్షించేవారు.

– ఎచ్చెర్ల ఉమామహేష్‌, ఏలూరు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కొత్త అంబులెన్స్‌ వాహనాలు కొనుగోలు చేయటంతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించాయి. అయితే ప్రస్తుతం అంబులెన్స్‌లు మరమ్మతులతో మూలనపడ్డాయి. బ్రేకులు, లైట్లు కూడా లేని వాహనాలను పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది.

– ఎం.గణేష్‌, ఏలూరు

ఏలూరు టౌన్‌: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో దేశానికే ఆదర్శంగా 108 అంబులెన్స్‌లను తీసుకువచ్చారు. అనంతరం కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేశాయి. 2019లో అధికారం చేపట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020లో 108 అంబులెన్స్‌ వాహనాలను కొత్తవి కొనుగోలు చేసి ఏలూరు జిల్లాకు 27 వాహనాలు అందించారు. వీటితో పాటు మరో 9 పాత వాహనాలు సేవలు అందించేవి. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో సేవలందించి అపర సంజీవనిలా నిలిచాయి. అయితే ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు మృత్యుశకటాలుగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం 108 సేవలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో అత్యవసర స్థితిలో రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

రిఫరల్స్‌తో ప్రాణసంకటం

ఏలూరు జీజీహెచ్‌తోపాటు దెందులూరు, భీమడోలు, నూజివీడు ప్రాంతాల్లోని 108 అంబులెన్స్‌ లు నిత్యం విజయవాడ, గుంటూరుకు రిఫరల్స్‌కు వెళుతూ ఉన్నాయని చెబుతున్నారు. ఏలూరు జిల్లాతోపాటు, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, భీమవరం, పాలకొల్లు, ఆకివీడు వంటి ప్రాంతాల నుంచి రోగులను ఏలూరు జీజీహెచ్‌కు వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు. ఏలూరు జీజీహెచ్‌లో అత్యవసర కేసులకు వైద్య చికిత్సలు అందించే నిపుణులైన వైద్యులు లేకపోవటంతో ఏలూరు నుంచి 108 అంబులెన్స్‌ల్లో విజయవాడ, గుంటూరు జీజీహెచ్‌లకు తరలిస్తున్నారు. ఉదయం వెళ్లిన అంబులెన్స్‌లు తిరిగి ఏలూరు చేరుకునే సుమారు 4–5గంటల సమయం పడుతుందనీ, ఈలోపు ఏదైనా అత్యవసర స్థితిలో క్షతగాత్రులను, అనారోగ్య బాధితులను హాస్పిటల్స్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లు ఉండటం లేదని సిబ్బంది అంటున్నారు.

ఏలూరులో మరమ్మతులతో నిలిచిపోయిన 108 అంబులెన్స్‌లు

108పై కూటమి నిర్లక్ష్యం

రోగులకు ప్రాణసంకటం

అత్యవసర స్థితిలో రాని అంబులెన్స్‌లు

మరమ్మతులు, బ్రేక్‌ డౌన్‌లో వాహనాలు

బాధితుల ప్రాణాలు పోతున్న వైనం

ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు వారం క్రితం ఏలూరు మినీ బైపాస్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావటంతో కూలబడ్డాడు. 108కు ఫోన్‌ చేస్తే వివరాలన్నీ తీసుకుని 15 నిమిషాల తర్వాత తాపీగా 40 నిమిషాలు పడుతుందని సమాధానమిచ్చారు. ఏదోవిధంగా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు దూరం కావటంతో ఆశ్రం హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. మూడు రోజుల అనంతరం బాధితుడిని గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశాడు.

ఏలూరు వన్‌టౌన్‌ నాగేంద్ర కాలనీకి చెందిన 20 ఏళ్ల గోపీకృష్ణ అనే యువకుడు జంగారెడ్డిగూడెం నుంచి మోటారు సైకిల్‌పై వస్తుండగా శుక్రవారం రాత్రి కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద మరో బైక్‌ను ఢీకొట్టి తీవ్రగాయాల పాలయ్యాడు. 108కు ఫోన్‌ చేస్తే.. 30 నిమిషాల అనంతరం కామవరపుకోట పీహెచ్‌సీ నుంచి డొక్కు వాహనం పంపారు. బ్రేకులు, లైట్లు, సైరన్‌ కూడా లేని అంబులెన్స్‌లో గోపీకృష్ణను తీసుకురావటానికి 2 గంటల సమయం పట్టింది. ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వైద్యులుపరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !1
1/4

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !2
2/4

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !3
3/4

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !4
4/4

కుయ్‌ కుయ్‌.. కుయ్యోమొర్రో !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement