
ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
కామవరపుకోట: సీ్త్ర శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రూ.50 వేలు అందించి వారి కుటుంవాలను ఆదుకోవాలని శ్రీ కోట వీరభద్ర ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కామవరపుకోట పాసింజర్ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్ జి.ఎలీషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఒకపక్క ఆటో ఫైనాన్స్ కిస్తీలు, మరోపక్క ఆటో మరమ్మతులు, చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ప్రభు త్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో వర్కర్స్ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందని, వెంటనే కార్మికులను ఆదుకునేలా చర్యలు తీసుకో వా లని డిమాండ్ చేశారు. కామవరపుకోట ఆటో యూ నియన్ సభ్యులు బంగారు రమణ, దొంత నాగ శిరోమణి రాజు, లింగాల నాగేశ్వరరావు, గుద్దేటి శ్రీనివాసరావు, కరిని శ్రీనివాసరావు, షేక్ ఇమామ్ సాహెబ్, హరీష్ బాబు, మల్ల మురళి పాల్గొన్నారు.