నాకు పింఛన్ అర్హత లేదా?
నాకు పింఛన్ అర్హత లేదా? యూరియా కొరతను నివారించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో పలుచోట్ల యూరియా కొరత నెలకొందని అన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేస్తున్నామని కలెక్టర్ చెబుతున్నా పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కొందరు వ్యవసాయ శాఖ అధికారులు నానో యూరియాను రైతులకు అంటగట్టడం కోసమే కృత్రిమ కొరత సృష్టించారేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో వ్యాపారులు అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సబ్సిడీపై పూర్తిస్థాయిలో యూరియా అందించాలని కోరారు.
లింగపాలెం: తనకు ఒక కాలు లేదని, కర్ర లేదా మరో వ్యక్తి సాయంతో నడవాలని.. అయినా దివ్యాంగ పింఛన్‌కు అర్హత లేదా అని లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెంకు చెందిన దువ్వూరి నాగరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్న నాగరాజుకు పింఛన్ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అలాగే మండలంలో 103 మంది దివ్యాంగులకు సచివాలయ ఉద్యోగులు నోటీసులు అందించారు. మరలా సర్టిఫికెట్ల ద్వారా ఎంపీడీఓ కార్యాలయం నుంచి రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సచివాలయ సిబ్బంది అనడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మండలంలో 83 మందిని ఆస్పత్రికి వెళ్లి పింఛన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సచివాలయ ఉద్యోగులు తెలియజేశారు.