
ఎరువుల షాపులపై దాడులు
లింగపాలెం : లింగపాలెం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ, రెవిన్యూ శాఖల అధికారులు ఎరువుల షాపులపై దాడులు నిర్వహించారు. ములగలంపాడులోని శ్రీవిజయదుర్గా ట్రేడర్స్‌లో దాడులు నిర్వహించగా ఎరువులు తేడా వచ్చిట్లు అధికారులు తెలిపారు. ఈ తేడాలకు సంబంధించి రూ.5.80 లక్షల ఎరువులను సీజ్ చేసి కేసునమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎరువుల విక్రయాలు పారదర్శికంగా నిర్వహించాలని షాపుల యజమానులకు అధికారులు సూచించారు. అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన, పాఠశాలలకు అందించే స్కూల్ ఆఫ్ సోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు జిల్లాలోని 5 పాఠశాలలు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి స్థానంలో పెదవేగి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ద్వితీయ స్థానంలో ఏలూరు సెయింట్ థెరిసా బాలికల ఉన్నత పాఠశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాల ఉన్నాయన్నారు. 4వ స్థానంలో వట్లూరులోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, 5వ స్థానంలో కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయన్నారు.