
శ్రీవారి సేవలోహైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వి.సుజాత శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
మద్ది అంజన్న సేవలో..
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. మద్ది అంజన్నను హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహిస్తున్నట్లు, ఈవో తెలిపారు. గన్నవరానికి చెందిన పాలడుగు సత్యసాయి కుమార్ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు తెలిపారు.