
●కాలువ గట్టు కబ్జా
ఉండిలో కాలువగట్టు ఆక్రమణలకు గురవుతోంది. ఏకంగా కాలువ గట్టుకు గేటు పెట్టి తాళం వేసి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఉండి సెంటర్‌కు సమీపంలో కొత్తగా నిర్మాణం చేస్తున్న అన్న క్యాంటీన్ వెనుక ఓ రైతు తన చెరువులు, హ్యాచరీకి వెళ్లేందుకు పాములపర్రు పంట కాలువపై గతంలో వంతెన నిర్మాణం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ గణపవరం రోడ్డును ఆనుకుని వంతెనకు గేటు పెట్టి దానికి తాళం వేసేశారు. దీంతో ఆయన చెరువుల క్షేమం సంగతి అటుంచితే పాములపర్రు కాలువ గట్టును పూర్తిస్థాయిలో ఆక్రమించేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పంటకాలువ గట్టును ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
– ఉండి