
ఉచిత బస్సు పేరుతో మోసం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని.. రాష్ట్రంలో ఎక్కడికై నా ఉచిత బస్సులో తిరగవచ్చని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు, ఉచిత బస్సుకు ఆంక్షలు విధించారని, కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేయటం మహిళలను మోసం చేయడం కాదా? అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి మండిపడ్డారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒక బస్టాప్‌కు పల్లె వెలుగు రావాలంటే మూడు గంటలు పడుతుందని, అప్పటి వరకూ మహిళలు వేచిఉండాల్సి రావడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మహిళలకు నెలకి రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి నేటికి 15 నెలలు అవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సీ్త్రనిధి పథకంలో ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18000 బకాయి ఉన్నారని, ఈ సొమ్ములు ఎప్పుడు మహిళల ఖాతాల్లో జమచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు పర్మిట్ రూమ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. విచ్చలవిడిగా బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారని మద్యం ఏరులై పారించేలా చంద్రబాబు అనుమతులు ఇవ్వటం దారుణం అన్నారు. సమావేశంలో ఏలూరు కార్పొరేటర్లు డింపుల్ జాబ్, ఇనపనూరి కేదారేశ్వరి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసీ, బట్టు విజయలక్ష్మి, కట్టా ఉమాదేవి, కుమారి, పాలనాటి పరమేశ్వరి, సునీత, రుబీనా భేగం, మోబీనా, అక్షయ, రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎండీ ప్రకటన బాధాకరం
దెందులూరు: విద్యార్థులకు బస్సుల్లో ఉచిత బస్సు పథకం వర్తించదని ప్రకటించడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తొత్తడి వేదకుమారి అన్నారు. దెందులూరులో మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పదేపదే చెప్పారన్నారు. షరతులు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
5 రకాల బస్సులకే ఉచితం పరిమితం
నెలకు రూ.1500 సీ్త్రనిధి హామీ ఏమైంది?