
పెన్షనర్లకు నోటీసులు
దెందులూరు: కొవ్వలిలో 30 మంది పెన్షనర్లకు సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశా రు. పెద్ద కళావతి, మన్నే కొండలరావు, పి.అప్పలనాయుడు నోటీసులను విలేకరులకు చూ పించారు. తమకు పెన్షన్ ఒక్కటే ఆధారమని, పెన్షన్ తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి అధ్వానంగా మారుతుందని వాపోయారు. పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వానికి సమర్పించిన వైద్య నివేదికలను రీ వెరిఫికేషన్ చేస్తున్నారని, నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు ఎవరికై నా ఇబ్బంది కలిగితే ఉన్నతాధికారులకు అప్పీ లు చేసుకోవచ్చని ఎంపీడీఓ కె.శ్రీదేవి తెలిపారు.
పోలవరం రూరల్: గ్రామంలోని కృష్ణారావు పేట పీఏసీఎస్ వద్ద సోమవారం యూరియా కోసం రైతులు క్యూకట్టారు. యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా కొనాలంటూ సొసైటీ సిబ్బంది చెబుతుంటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వందలాది మంది ఎదురుచూడగా రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా దొరికింది. ప్రస్తుతం సరఫరా తక్కువ, వాడకం ఎక్కువగా ఉండటంతో యూరియా దొరకడం లేదని తెలుస్తోంది. గూ టాల, పట్టిసీమ, ప్రగడపల్లి పట్టిసీమ సొసైటీలకు 15 టన్నుల యూరియా ఇండెంట్ పెట్టా మని, వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో అందిస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి కె.రాంబాబు తెలిపారు.
ఏలూరు టౌన్: జిల్లాలో నూతన బార్ పా లసీ–25లో భాగంగా 18 బార్ల లైసెన్సుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధి కారి ఎ.అవులయ్య తెలి పారు. స్థానిక ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 18 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రిజర్వ్ కేటగిరీలో గీత కులాలకు మరో రెండు బార్లకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఏలూరులో 11, నూ జివీడులో 4, జంగారెడ్డిగూడెంలో 2, చింతలపూడిలో ఒక బార్‌కు అనుమతుల వచ్చాయ న్నారు. ఈనెల 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28న కలెక్టర్ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారన్నారు.
రిజర్వు కేటగిరీ బార్లకు లాటరీ
ఏలూరు(మెట్రో): రిజర్వు కేటగిరీలకు కేటాయించిన బార్లకు సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీశారు. జంగారెడ్డిగుడెంలో ఓ బార్‌ను గౌడ కులానికి, ఏలూరులో ఓ బార్‌ను శెట్టి బలిజ కులానికి కేటాయించారు.
ఎంపీడీఓకు గ్రామస్తుల ఫిర్యాదు
ఉంగుటూరు: మండలంలోని రావులపర్రుకు చెందిన జనసేన నేత తాడిశెట్టి శివప్రసాద్ తమను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామానికి చెందిన ఆరుగురు వేర్వేరుగా సోమవారం ఎంపీడీఓ రాజ్‌మనోజ్‌కు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని ఫిల్టరు బెడ్లు నిర్మించడంతో శుద్ధి కాని నీటితో అనారోగ్యాలు వస్తున్నాయని యడవల్లి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. శివప్రసాద్ తన ఇంటి పక్కన మూడు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని, డ్రెయినేజీ నీరు బయటకు వదలడంతో ఇబ్బంది పడుతున్నామని దోనాద్రి దానయ్య ఫిర్యాదు చేశారు. గ్రామంలో కమ్యునిటీ హాలుకు ఆనుకున్న ఉన్న సిమెంట్ రోడ్డుపై మరో సిమెంట్ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఇబ్బా పూజారి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మంచినీటి చెరువు ను ఆనుకుని ఉన్న చెరువు పోరంబోకులో ఇంటిని నిర్మించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకోవడంతో నీరు వెళ్లకు ఇబ్బంది పడుతున్నామని ఇబ్బా నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పంచాయతీ రోడ్డును ఆక్రమించుకుని రేకుల షెడ్డు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఇబ్బా ముత్యాలరావు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు.

పెన్షనర్లకు నోటీసులు

పెన్షనర్లకు నోటీసులు

పెన్షనర్లకు నోటీసులు