
జిల్లాలో అడుగడుగునా సమస్యలే..
అజెండాపై గోప్యత
ఏలూరు (మెట్రో): జిల్లాలో అడుగడుగునా సమస్యలే.. రైతులకు తీవ్ర ఇబ్బందులే.. ప్రభుత్వం ప్రకటించే పనుల్లోనూ ప్రజలకు కష్టాలే.. ఇవి సా క్షాత్తూ జిల్లా సమీక్షా సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా సమీక్షా సమావేశాన్ని (డీఆర్‌సీ) ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అ ధ్యక్షతను నిర్వహించారు. జిల్లాలో రైతులు యూ రియా విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క యూ రియా బస్తా కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని, జిల్లాలో ఏర్పాటుచేసిన కోకోనట్ బోర్డు ప్రశ్నార్థకంగా మారిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు, ఉచి త బస్సు పథకంలో సమస్యలపై ఏలూరు ఎమ్మె ల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు. నారాయణపురం బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కోరారు. ఇన్‌చార్జి మంత్రి మనోహర్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సాగులో నానో, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. కలెక్టర్ వెట్రిసె ల్వి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని పౌర సరఫరా ల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీఆర్‌సీ సమీక్ష సమావేశానంతరం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులు అందజేస్తా మని మంత్రి చెప్పారు. అన్నదాత సుఖీభవ ప థకం కింద నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే వారికి మరోసారి అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. పథకం లోటుపాట్లపై ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎ మ్మెల్యే చింతమనేని సూచన మేరకు కోకోనట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యేల గళం
జిల్లా సమీక్షా సమావేశంలో ప్రధానమైన అంశాలు చర్చించేందుకు అజెండాను ఏర్పాటు చేస్తారు. అయితే అజెండాను అందించడంలో మాత్రం గోప్యత పాటిస్తున్నారు. కనీసం మీడి యా ప్రతినిధులకు అజెండా ప్రతులను అందించాల్సి ఉన్నా లేవని అధికారులు చెప్పడం గమనార్హం. కనీసం అధికారులకు సైతం పూర్తిస్థాయిలో అజెండా ప్రతులను అందించడంలో సంబంధిత శాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.