
చీకటి జీఓను రద్దు చేయాలి
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్ అన్నారు. ఏలూరులోని పార్టీ కా ర్యాలయంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో విద్యారంగం నిర్వీర్యం అయ్యిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతిస్తే ప్రభుత్వ వైఫల్యాలు, డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే నిషే ధం విధించారన్నారు. పిల్లలకు ఇచ్చిన బ్యాగులు, మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పేద పిల్లల విద్యాభివృద్ధికి విశేష కృషిచేశారని, నాడు–నేడుతో కార్పొరేట్ వసతులు కల్పించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నా మంత్రి లోకేష్ స్పందించటం లేదన్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దాలి వెంకటేష్, ఏలూరు నియోజకవర్గ వలంటీర్ విభా గం అధ్యక్షుడు ఉయ్యాల గణేష్, ఏలూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస బాలాజీ, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి పల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.