
మురిసిన మువ్వన్నెలు
న్యూస్‌రీల్
నిండా ముంచిన గోస్తనీ
భారీ వర్షాలకు పెనుమంట్ర మండలంలో గోస్తనీ న ది, గొంతేరు, భగ్గేశ్వరం మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. 8లో u
● అంబరాన్నంటిన సంబరాలు
● పందాగ్రస్టు వేడుకల్లో చిన్నారులు
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఏలూరు (మెట్రో): పందాగ్రస్టు వేడుకలు అంబరా న్ని తాకాయి. దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్ర వారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
భళా.. సాంస్కృతిక వేళ
చిన్నారుల దేశభక్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నూజివీడు త్రివిధ హైస్కూల్, భీమడోలు మండలం పోలసానిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలతో భళా అనిపించారు. గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్ ప్రభుత్వ వ్యాయమ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల విద్యార్థులు మల్కం ప్రదర్శన మొదటి బహుమతి, నూజివీడుకు చెందిన రైట్స్ సంస్థకు చెందిన బాలికలు రెండో బహుమతి, ఏలూరులోని కస్తూరిబా మున్సిపల్ బాలికల హైస్కూల్‌కు మూ డో బహుమతి, కలిదిండి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు నాల్గో బహుమతి గెలుచుకున్నారు.
ఆకట్టుకున్న స్టాల్స్
వ్యవసాయ, ఉద్యాన, జిల్లా గ్రామీణాభివృద్ధి, మ హిళా శిశు సంక్షేమ, పశుసంవర్థక, సమీకృత గిరిజ నాభివృద్ధి శాఖలు, బీసీ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 1,935 మహిళా సంఘాలకు చెందిన 8,423 మంది సభ్యులకు సీ్త్రనిధి కింద రూ.66.32 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలను మంత్రి పార్థసారథి పంపిణీ చేశారు. ఉన్నతి కింద 231 సంఘాలకు చెందిన 368 మంది సభ్యులకు రూ.2.28 కోట్లు అందజేశారు. వ్యవసాయ రైతు సాధికార సంస్థ, ఉద్యాన శాఖ, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి స్టా ల్స్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
శకటాల ప్రదర్శన : వ్యవసాయ, వైద్యారోగ్య శాఖ, గృహనిర్మాణం, అన్న క్యాంటీన్, అగ్నిమాపక శాఖ తదితర శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యా శకటానికి ప్రథమ, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ, గృహనిర్మాణ శాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చాయి. వేడుకల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకష్ణయ్య, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జేసీ పి.ధాత్రిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలవరం జిల్లాకు గర్వకారణం
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఏలూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంతృప్తికరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమన్నారు.

మురిసిన మువ్వన్నెలు

మురిసిన మువ్వన్నెలు