
మహనీయుల త్యాగాలు మరువలేం
ఏలూరు టౌన్/నూజివీడు/గణపవరం: దేశ స్వా తంత్య్ర సాధన కోసం ఎందరో మహనీయులు ప్రా ణత్యాగాలు చేశారని, వారి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వా తంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మా మిళ్లపల్లి జయప్రకాష్, నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీ నివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూ కపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ బాజీ, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు రియాజ్ ఆలీఖాన్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి, పైడి భీమేశ్వరరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, ఆర్‌టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడులోని పలు ప్రధాన కూడళ్ల వద్ద మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని అన్నారు. గణపవరంలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆశయ సాధన కోసం కంకణ బద్ధులం కావాలని పిలుపునిచ్చారు.

మహనీయుల త్యాగాలు మరువలేం

మహనీయుల త్యాగాలు మరువలేం