
సమైక్యతకు పాటుపడాలి
ఏలూరు టౌన్: దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు కృషి చేయాలని అన్నారు. ఏలూరు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జేసీ ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు.
చాట్రాయి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మండలంలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోకి వరద నీరు చేరుతోంది. రేగడి వాగు, నల్లవాగు, ఉప్పువాగుల్లో వరద పెరుగుతోంది. ప్రస్తుతం 3,400 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుందని టీఆర్‌పీ ఏఈ కడిమె లాజరుబాబు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన సీ్త్ర శక్తి పథకాన్ని శుక్రవారం ఏలూరు కొత్త బస్టాండులో మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రా రంభించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్‌కుమార్, పి. ధర్మరా జు, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అ ప్పలనాయుడు, జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమలకు చెందిన పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జగన్, తనకు పదవి రావడానికి కారణమైన మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అ ధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, పార్టీ మండల అధ్యక్షుడు ప్రతాపనేని వాసుకి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
జంగారెడ్డిగూడెం: జల్లేరు గ్రామంలో ఎర్రకాలువలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు శుక్రవారం 25 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. దీనిని ఓ వ్యక్తి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు.
నరసాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవం నాడు మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగాయి. అధికారులకు విషయం తెలిసినా కన్నెత్తి చూడలేదు.

సమైక్యతకు పాటుపడాలి

సమైక్యతకు పాటుపడాలి

సమైక్యతకు పాటుపడాలి