
దేశభక్తిని పెంపొందించుకోవాలి
ఏలూరు (టూటౌన్): యువత దేశభక్తితో పాటు స్ఫూర్తిని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధా న న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరు లోని జిల్లా కోర్టు కార్యాలయంలో శుక్ర వారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు నిరంతరం కృషి చేస్తున్నారని, కాని దేశంలో అంతర్గతంగా భద్రత, అభివృద్ధి మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలన్నారు. సైనికుల విజయాలతో యువత స్ఫూర్తిని, దేశభక్తిని మరింత పెంపొందించుకోవాలన్నారు. అమరవీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో జడ్జి కుమారి కె.వాణిశ్రీ, న్యాయమూర్తులు, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు కోనె సీతారాం, ప్రభుత్వ న్యా యవాది బీజే రెడ్డి, పీనీ ఏవీ నారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.