‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
కై కలూరు: ప్రజలకు హామీలిచ్చి, వాటిని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న జరిగే వెన్నుపోటు దినంను అందరూ విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. శనివారం కై కలూరు పార్టీ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కై కలూరు రైల్వేస్టేషన్ సమీప పార్టీ కార్యాలయానికి ఉదయం 9 గంటలకు నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గాలిబ్‌బాబు, ఎంపీటీసీ సభ్యు రాలు పట్టపు బాలమ్మ, పార్టీ నాయకులు సమయం వీరాంజనేయులు, పంజా రామారావు, వైబీఎం.సాంబశివరావు, ఉడ్రమట్ట ఏసుకుమార్, బుర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నియామక పత్రాల అందజేత
గ్రామస్థాయి పార్టీ కమిటీల ఎంపిక స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక, బొమ్మినంపాడు, ములకలపల్లి, దేవపూడి, కొరగుంటపాలెం గ్రామాలు, కలిదిండి మండలం గోపాలపురం, కాళ్లపాలెం, వెంకటాపురం గ్రామ పార్టీ కమిటీలకు నియామక పత్రాలను డీఎన్నార్ అందించారు ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ పిలుపు


