
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
● రయ్.. రయ్.. స్కేటింగ్
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో స్కేటింగ్‌లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఐదేళ్లు నుంచి 18 సంవత్సరాల వరకు స్కేటింగ్‌లో మెళకువలు, పోటీ ప్రవేశాలకు శిక్షణ ఇస్తున్నారు. అండర్–14 అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలకు రూ.600, 14 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 2 వేలు అడ్మిషన్ ఫీజు, నెలకు రూ.1000 నిర్ణయించినట్లు స్కేటింగ్ కోచ్ చెప్పారు. వివరాలకు ఎస్‌కే ఖాసీం నంబర్ 94406 47391లో సంప్రదించాలని కోరారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు
కుక్కునూరు: నెమలిపేట గ్రామ సమీపంలో ఉపాధి కూలీలపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన 20 మంది కూలీలు రాయికుంట గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కూలీలపై దాడిచేశాయి. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో కంటిపల్లి శిరీష, కంటిపల్లి కుమారి, పట్ల దుర్గమ్మ, కారం రామారావు, కారం భద్రమ్మ, వర్స సీత, కౌలూరి శిరీష తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ఇళ్లకు పంపించారు. బాధితులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వై నాగేంద్రరావు పరామర్శించారు.

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి