జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి

Apr 20 2025 1:07 AM | Updated on Apr 20 2025 1:07 AM

జేఈఈ

జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి

ఉండ్రాజవరం: జేఈఈ మెయిన్స్‌–2025 ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో మరోసారి సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యా సంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ శనివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో జి.అనూప్‌రాజ్‌ 26, డి.మణికంఠరెడ్డి 63, ఎ.శివరామ్‌ 142, బి.నిఖిల 159, ఏఎల్‌ జ్ఞాన ప్రకాష్‌ 168, కె.జైకిశాన్‌ 225, కె.ఆనంద్‌ 266, ఎం.సాయి కిరణ్‌ 292, పి.సుకుమార్‌ 363, పీవై సుందరరెడ్డి 436, డి.శర్వాన్‌ 448, ఐ.రామచరణ్‌ 477, కె.శివ సత్యదేవ్‌ 543, సీహెచ్‌ యశస్విని 623, షేక్‌ అబ్దుల్‌ వహబ్‌ 671, కె.ఆనంద్‌పాల్‌ 756, కె.ఉజ్వల్‌ కిరణ్‌ 859, కె.చరణ్‌దీప్‌ 871, బి.చైతన్య 913 ర్యాంకులు సాధించారని వివరించారు. 100 లోపు ఇద్దరు, 500 లోపు 12 మంది, 1,000 లోపు 19 మంది, 5,000 లోపు 58 మంది, 10,000 లోపు 101 మంది, 15,000 లోపు 134 మంది, 20,000 లోపు 161 మంది, 30,000 లోపు 219 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు.

శ్రీషిర్డీసాయి విద్యార్థుల ప్రతిభ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి జూనియర్‌ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్‌ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్‌ మోక్షిత్‌ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్‌ శ్రీరామ్‌ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2,000 లోపు, 45 మంది 5,000 లోపు, 64 మంది 10,000 లోపు, 88 మంది 20,000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్‌కు అర్హత సాధించారన్నారు. విద్యాసంస్థల చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ మాట్లాడుతూ ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్‌ చంద్రశేఖర్‌ అభినందించారు.

జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి 1
1/1

జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement