రేంజ్ పరిధిలో పటిష్ట పోలీసింగ్
జంగారెడ్డిగూడెం: జిల్లాలో పటిష్ట పోలీసింగ్‌కు చర్యలు తీసుకున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్, టౌన్ పోలీస్‌స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం తెలంగాణకు సరిహద్దున ఉండటం, జాతీయరహదారి సైతం పట్టణాన్ని ఆనుకుని వెళ్లడం, వ్యాపార కేంద్రంగా ఉండటంతో నేరస్తులకు సెంటర్ పాయింట్‌గా మారుతోందని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాకు ఈ మార్గం అనువుగా ఉండటంతో నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణంలో రూ.35 లక్షలతో 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. పట్టణంలో పోలీస్‌స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్‌కు, క్రైమ్‌కు ఎస్సైలు ఉండేలా ఆలోచన ఉందన్నారు.
22 సీసీ కెమెరాలు : రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాలో 22 వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. మహా నాయకుల విగ్రహాల సమీపంలో సీసీ కెమెరాల ఏ ర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పో క్సో కేసులు నమోదవుతున్నాయని, మహిళా పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐజీ సూచించారు. ఎవరైనా డిజిటల్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడితే 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రేంజ్ పరిధిలో నక్సలైట్ల ప్రభావం లేదని, పోలవరం ప్రాజెక్టు వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతా చర్యలు చేపట్టిందని చెప్పారు. వీఐపీల పర్యటనలో భాగంగా మరింత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు వి.కృష్ణబాబు, రాజశేఖర్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఐజీ అశోక్‌కుమార్


