‘గోదారి గట్టుపైన’ చిత్ర షూటింగ్ సందడి
తణుకు అర్బన్: ‘గోదారి గట్టుపైన’ చిత్రం షూటింగ్ తణుకు మండలం వేల్పూరులో సందడి చేసింది. గత రెండురోజులుగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో బుధవారం ప్రముఖ నటుడు జగపతిబాబు వేల్పూరు రహదారులపై హల్‌చల్ చేశారు. ముఖ్యంగా వేల్పూరు ప్రధాన రహదారిపై జగపతిబాబు ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రయాణిస్తున్నట్లుగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్రంలో హీరో సుమంత్ ప్రభాస్‌తోపాటు జగపతిబాబు కలిసిన షూటింగ్ సన్నివేశాలను తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
వ్యాయామ కళాశాలలో ఇంట్రా మ్యూరల్ పోటీలు
దెందులూరు: క్రీడా పోటీలు అంతర్గత ప్రతిభను వెలికితీస్తాయని సర్వ శిక్ష అడిషనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ అన్నారు. బుధవారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో ఇంట్రా మ్యూరల్ కబడ్డీ పోటీలు బాలురు, బాలికల విభాగాల్లో జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ నతానియేలు, గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ దిలీప్ కుమార్, సొంగ డాక్టర్ డీ.రత్నబాబు, సూపరింటెండెంట్ పతాంజలి, జై శ్రీ వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.
పీజీ విద్యార్థి అనుమానాస్పద మృతి
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మానూరుకు చెందిన తాడిశెట్టి వెంకటేష్ (24) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంకటేష్ రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సు చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి నుంచి మానురు స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి కుటుంబ సభ్యులందరితో సరదాగా సంతోషంగా గడిపాడు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. నోటి నుంచి పురుగు మందుల వాసన రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు అతన్ని పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘గోదారి గట్టుపైన’ చిత్ర షూటింగ్ సందడి


