
నేరాల నిరోధానికి పటిష్ట చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులపై నిరంత నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కేసుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో వ్యాపార సముదాయాలు, ఆలయాలు, అపార్ట్‌మెంట్లు, ముఖ్య కూడళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలనీ, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డీఎస్పీలు డి.శ్రావణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శివకిషోర్