
కాళ్ల మండలం బొండాడపేటలో పథకాలను వివరిస్తున్న నాయకులు (ఫైల్)
పున్నమి పూజలు
జిల్లాలోని పంచారామక్షేత్రాలు పాలకొల్లు, భీమవరంలో కార్తీక పౌర్ణమి పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జ్వాలాతోరణం వెలిగించారు. 8లో u
నవరత్నాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపారు.. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు.. ప్రజల ముంగిటకు పాలన కోసం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.. విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. కులం, మతం, వర్గం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చుతున్నారు.. సామాజిక సాధికారతే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నింటా అగ్రతాంబూలం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ అమలుచేస్తూ పాలన సాగిస్తున్నారు.. అందుకే రాష్ట్రానికి జగనే అవసరమని జిల్లావాసులు నినదిస్తున్నారు.. ఆయన చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేస్తున్నారు..
సోమవారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2023
పక్షుల అందాలు అద్భుతం
కై కలూరు: కొల్లేరు పక్షుల అందాలు అద్భుతంగా ఉన్నాయని ఏలూరు జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఆమె సందర్శించారు. ముందుగా బోటు షికారు చేస్తూ దగ్గర నుంచి పెలికాన్ పక్షుల కేరింతలను ఆస్వాదించారు. అనంతరం స మీప పక్షి నమూనా మ్యూజియాన్ని తిలకించా రు. అటవీ శాఖ డెప్యూటీ రేంజర్ జయప్రకాష్ కొల్లేరు పక్షుల విశేషాలు, నైసర్గిక స్వరూపం వివరించారు. ఇన్ని పక్షులను ఒకేసారి చూ డటం ఆనందంగా ఉందని ఎస్పీ అన్నారు. కై క లూరు రూరల్, టౌన్ సీఐలు కృష్ణకుమార్, ఆ కుల రఘు, ఏఎస్సై మల్లికార్జునరావు, ఫారెస్టు బీటు అధికారి కావడి వెంకన్న ఉన్నారు.
జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత
కై కలూరు: కొల్లేరు జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలని ఏలూరు జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా టూ రిజం ఇన్‌చార్జి ఆఫీసర్ డి.సూర్యతేజ అన్నారు. కుటుంబసమేతంగా ఆయన ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. బోటు షికారు చేస్తూ పెలికాన్, పెయింటెడ్ స్టాక్ పక్షుల విన్యాసాలను వీక్షించారు. అనంతరం పక్షుల నమూనా మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కొల్లేరుకు వలస పక్షులు రాకా ఎక్కువయ్యిందన్నారు. పక్షుల కేంద్రంలో మరిన్ని కృత్రిమ స్టాండ్లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఏకో టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. కొల్లేరు చుట్టూ ఎకో సెన్సిటివ్ బఫర్ జోన్ పరిధిపై అధ్యయనం చేస్తానన్నారు. కొల్లేరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామన్నారు. డె ప్యూటీ ఫారెస్టు రేంజర్ జయప్రకాష్, ఫారెస్టు బీ టు ఆఫీసరు కావడి వెంకన్న ఉన్నారు.
ఏపీ ఫిషరీస్‌కి ఎక్సలెన్స్ అవార్డు
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగ అభివృద్ధి, రొయ్యల ఉత్పత్తి తదితర అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్‌కు అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్ దక్కింది. ముంబైలో ఈనెల 21, 22 తేదీల్లో పీటుసీ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ష్రింప్ రిటైల్ సెమినార్ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధి, రొయ్యల ఉత్పత్తి, రిటైల్ రేట్స్, సీడీ, ఫీడ్‌లు, ప్రభుత్వ పనితీరుపై రఘురాం మాట్లాడారు. ఆక్వా రంగంపై సీఎం జగన్ చూపిస్తున్న చొరవ, అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఆక్వా రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.
సాక్షి, భీమవరం: అమ్మఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, పింఛన్ కానుక, ఆసరా, చే యూత, ఆరోగ్యశ్రీ తదితర 33 పథకాల ద్వా రా గతేడాది రికార్డుస్థాయిలో పశ్చిమగోదావరి జి ల్లాలోని 25.95 లక్షల మందికి రూ.3,683.85 కోట్ల లబ్ధి చేకూరింది. వీరిలో ఒకే ఇంటిలో మూడు నాలుగు పథకాలకు పైగా అందుకుంటున్న వారు ఎందరో. శాసనమండలి చైర్మన్, పౌరసరఫరాల శా ఖ మంత్రి, ఎమ్మెల్సీ, శెట్టిబలిజ, వక్ఫ్‌బోర్డు, సంచార జాతుల కార్పొరేషన్ చై ర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లు తదితర కీలక పదవులను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులకు ఇచ్చి సామాజిక సాధికారత చేసి చూపించారు.
ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ.. వైఎస్సార్ సీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలు వివరిస్తూ రాష్ట్రానికి సీఎం జగన్ అవసరాన్ని తెలిపేందుకు చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా అందిస్తున్న సాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటా వివరిస్తున్నారు. సచివాలయ పరిధిలో చేకూరిన లబ్ధిని తెలిపే సంక్షేమ బోర్డులను ఆవిష్కరిస్తున్నారు. పాలనపై వలంటీర్లు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,21,340 ఇళ్లకు గాను ఇప్పటికే 61,623 ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తమకు జరిగిన మేలును ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి నేతలు, అధికారులకు ఆనందంగా తెలియజేస్తున్నారు.
ఒకటో తారీఖునే పింఛన్
గతంలో పింఛన్ కోసం కాళ్లీడ్చుకుంటూ రెండు కిలోమీటర్లు వెళ్లేవాణ్ణి. ఇప్పుడు ఒకటో తారీఖు తెల్లారకుండానే వలంటీర్ అబ్బాయికి ఇంటికి వచ్చి రూ.2,750 ఇస్తున్నారు. బియ్యం కూడా ఇంటి వద్దనే అందిస్తున్నారు. రేషన్ బియ్యం, పింఛన్ డబ్బులు నాకు, ముసలిదానికి సరిపోతున్నాయి. మొన్నీమధ్యనే మా సచివాలయం వద్దకు పెద్ద డాక్టర్లు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి మందులిచ్చారు. ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదు.
– మర్రి బుల్లియ్య,
కొత్త నవరసపురం, నరసాపురం రూరల్
ఏళ్ల నాటి సొంతింటి కల సాకారం
అద్దె ఇంట్లో ఉంటూ సొంతింటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. జగనన్న వచ్చాకే మాకు ఇంటి స్థలం మంజూరు చేశారు. భీమవరం మండలం శ్రీరాంపురం జగనన్న కాలనీలో ప్రభుత్వ సాయంతో ఇంటిని నిర్మించుకున్నాం. ఇటీవల నా భర్తకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు. నాకు అమ్మఒడి, ఆసరా డబ్బులు వస్తున్నాయి. దివ్యాంగురాలైన నా కుమార్తెకు పింఛన్ వస్తోంది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ధరాలకోట పద్మావతి, వెంప, భీమవరం రూరల్
వెలుగులు నింపిన జగన్
దివంగత సీఎం వైఎస్సార్ స్థలం ఇవ్వగా సీఎం జగన్ ఇల్లు మంజూరు చేయడంతో 2021లో ఇల్లు కట్టుకున్నాను. నా సొంతింటి కల నెరవేరింది. మా చిన్నమ్మాయికి రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. నా భార్యకు కాపునేస్తం మంజూరైంది. ఇలా ఆ తండ్రీ, కొడుకుల సాయంతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు పిల్లల చదువులు పూర్తయ్యాయి. అందుకే జగనన్నే మళ్లీ సీఎంగా రావాలి. ఆయన మా జీవితాల్లో వెలుగులు నింపారు.
– అరవ లింగయ్యనాయుడు, మేడపాడు, యలమంచిలి మండలం
అమ్మఒడితో చదువు భారం తగ్గింది
బాబు పుట్టిన ఏడాదికే నా భర్త చనిపోయారు. చాలాకాలం పింఛన్ రాక ఇబ్బంది పడ్డాను. జగనన్న వచ్చాక పింఛన్ సాయం పెరిగింది. అమ్మఒడి, కాపునేస్తం మంజూరయ్యాయి. మా అబ్బాయికి స్కూల్‌లోనే రుచికరమైన భోజనం పెడుతున్నారు. పుస్తకాలు, యూనిఫాం, షూలు ఇలా అన్ని ప్రభుత్వమే ఇస్తుండటంతో చదువు భారం తగ్గింది. ఇలా పలురకాలుగా మేలు చేస్తున్న జగన్‌కు రుణపడి ఉంటాం.
– కలవల నాగవెంకటలక్ష్మి, మేడపాడు, యలమంచిలి మండలం
న్యూస్‌రీల్
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఇలా..
నియోజకవర్గం మొత్తం ఇప్పటివరకు
ఇళ్లు సందర్శించినవి
భీమవరం 98,452 7,450
నరసాపురం 73,027 12,973
ఆచంట 65,804 1,613
పాలకొల్లు 98,080 6,769
తాడేపల్లిగూడెం 92,541 7,169
తణుకు 99,950 12,836
ఉండి 98,486 12,813
జనం నోట.. ఒకే మాట
పేదరికమే ప్రామాణికంగా పథకాలు
‘పశ్చిమ’లో 25.95 లక్షల మందికి రూ.3,683.85 కోట్ల లబ్ధి
సామాజిక సాధికారతకు పెద్దపీట
జిల్లా నేతలకు కీలక పదవులు
ఉత్సాహంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’
సర్వేకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
సర్వత్రా సంతృప్తి వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు




ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ఎస్పీ ప్రశాంతి



ముంబైలో అవార్డు అందుకుంటున్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం

