బకాయిలు విడుదల చేయాలి
చింతలపూడి: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. బకాయిల విడుదల కోరుతూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా వెంటనే స్పందించకుంటే డీసీహెచ్‌ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టు ముగిసి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించే సమయంలో కా ర్మికులకు రావాల్సిన జీతాలను చెల్లించకపోగా, ఆందోళన చేస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వీరి జీతాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంగళవారం నుంచి జిల్లా అధికారుల కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగుతామన్నారు.ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.మరియ మ్మ, కుమారి, వాణి తదితరులు పాల్గొన్నారు.


