అందని సహకారం | - | Sakshi
Sakshi News home page

అందని సహకారం

Jan 5 2026 10:53 AM | Updated on Jan 5 2026 10:53 AM

అందని

అందని సహకారం

న్యూస్‌రీల్‌

ఉద్యోగుల డిమాండ్లు

పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీ) కీలకం. వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆయా సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఖజానాకు ఏమాత్రం భారం కాని చిన్నపాటి సమస్యల పరిష్కారానికి మనసొప్పడం లేదు. ఆయా సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ద్వారా మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. కంటితుడుపు చర్యలు ప్రకటనలతో సరిపెట్టడం తప్పించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో విసుగు చెందిన ఉద్యోగులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు.

దశల వారీగా ఆందోళనలు

గతేడాది నవంబర్‌ 27న సహకార రంగంలో ఉన్న రెండు యూనియన్లు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించాయి. దీనిలో భాగంగా గతనెల 6న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. 8న డీసీసీబీ బ్రాంచి ఆఫీసుల వద్ద ధర్నాలు చేశారు. 16న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు అందించారు. 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు.

కనీసం చర్చలకూ పిలవలేదు

సహకార ఉద్యోగులు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కనీసం ఉద్యోగులతో చర్చలు కూడా జరపలేదు. దీంతో సహకార ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలు మరింత ఉధృతం చేసేందుకు నిర్ణయించి సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ దీక్షలను ఈనెల 26 వరకు కొనసాగించాలని కార్యాచరణ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన సహకార ఉద్యోగులు రోజుకు ఒక జిల్లా చొప్పున రిలే దీక్షల్లో పాల్గొనేలా ఆయా జిల్లాల నా యకులకు సూచించారు. ఈమేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు ఈనెల 6న విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించే దీక్షల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.

జీఓ నం.36ని అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చి డీఎల్‌ఎస్‌ఎఫ్‌ ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించాలి.

ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2019, 2024 వేతన సవరణలు జరగాలి. అప్పటివరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి.

గ్రాట్యూటీ సీలింగ్‌ ఎత్తివేసి చట్టప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 ఏళ్ల రిటైర్‌మెంట్‌ వయసు అమలుచేయాలి.

ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్‌ ఇ న్సూరెన్స్‌ చేయించాలి.

డ్యూ టు పద్దులను రద్దు చేయాలి.

2019 తరువాత సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి.

డీసీసీబీకి సహకార సంఘాలు చెల్లించిన షేరు ధనం 6 శాతానికి తగ్గకుండా డివిడెండ్‌ లేదా వడ్డీ సొసైటీలకు చెల్లించాలి.

సమస్యలు పట్టవా?

నెల రోజులుగా ఉద్యోగుల ఆందోళనలు

అయినా ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు

నేటి నుంచి రిలే దీక్షలకు పిలుపు

నెల రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించి సోమవారం నుంచి రిలే దీక్షలకు పిలుపునిచ్చాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకూ వెనకాడబోం. – కేవీవీ సత్యనారాయణ, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

అందని సహకారం 1
1/1

అందని సహకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement