మీర్జాపురంలో ‘బరి’తెగింపు
నూజివీడు: నూజివీడు పేరు చెబితే.. మామిడి తోట లు, బాస్కెట్‌బాల్, చెడుగుడు పోటీలు గుర్తుకు వస్తా యి. అయితే ప్రస్తుతం పేకాట శిబిరాలు, గ్రావెల్ మా ఫియా గుర్తుకు వస్తుంది. దీనికితోడు సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణకు అడ్డాగా మారనుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నూజివీడు ప్రాంతంలో జూదాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పండగ సాంప్రదాయం ముసుగులో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు నూజివీడు మండలం మీర్జాపురంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రచారం : కోడి పందేలకు బాపులపాడు మండలం అంపాపురం, ఏలూరు స మీపంలోని కొప్పాక సరసన మీర్జాపురం చేరనుంది. ఇక్కడ భారీ బరి ఏర్పాటు చేయడంతో పాటు సోష ల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు పెట్టి ప్రచా రం నిర్వహిస్తున్నారు. ప్రధాన బరిని మూడు ఎకరా ల్లో సిద్ధం చేశారు. కోడి పందెం వేసేందుకు ఒక ప్లాట్‌ఫాం, పందెలను చూసేందుకు మూడు వైపులా గ్యాల రీ, మరోవైపు వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాపురం గ్రామ పరిధిలో నేషనల్ హైవే–216 హెచ్ నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారికి సమీపంలో మీర్జాపురం–బిళ్లనపల్లి రోడ్డులో ఈ భారీ బరి సిద్ధమవుతోంది. సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ ముసుగు పందేలతో పా టు రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రాత్రీపగలూ తేడా లేకుండా పందేలు వేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూదగాళ్లు, కోడిపందేలు చూసేందుకు వచ్చే వారు నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరులోని హోటళ్లలో రూమ్‌లను బుక్ చేసుకున్నారు.
రూ.కోట్లలో పందేలు
మీర్జాపురంలో కోడి పందేలు కోట్లలో జరగనున్నాయి. మొదటి పందెం రూ.కోటి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బరి పందేంతో పాటు చూడటానికి వచ్చే వారు కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తారు. కోడి పందేలకు అనుబంధంగా పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి జూదాలతో పేదల జేబులు గుల్లకావడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారో లేదో చూడాలి మరి.
కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు


