
పెదపాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గ్రామాల అభివృద్ధి సూపర్ అని ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు అన్నారు. వాక్ విత్ అంబటి, కొఠారు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆళ్ల సతీష్‌చౌదరి ఆధ్వర్యంలో నిర్మించిన రూ.1 కోటి 16 లక్షల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దాతల సహకారంతో నిర్మించిన డైనింగ్ హాల్, పాఠశాల మైదానం అభివృద్ధి పనులను దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను, గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల కోసం చేపడుతున్నారని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని తెలిపారు. వట్లూరు సీతారామ పురంలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.21 వ్యయంతో నిర్మించిన హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వట్లూరు గ్రామంలో రూ.43 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవానాన్ని ప్రారంభించారు. సుమారు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, దెందులూరు ఏఎంసీ అధ్యక్షుడు ఆళ్ల సతీష్‌చౌదరి, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, బీసీ సెల్ అధ్యక్షుడు, నర్సాపురం నియోజకవర్గ పరిశీలకుడు ఘంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, సర్పంచ్ గుజ్జుల రత్నకుమారి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు పెనుమాల విజయ్, ఏలూరు, దెందులూరు మండలాల పార్టీ అధ్యక్షుడు తేరా ఆనంద్, కామిరెడ్డి నాని, సొసైటీ అధ్యక్షుడు ఆళ్ల శివరామకృష్ణ, ఉపసర్పంచ్ చింతా మధు, ప్రధానోపాధ్యాయురాలు ఏ.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు