బాగున్నావా చెల్లెమ్మా..
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వాకర్లను కలసి ఓట్లు అభ్యర్థించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావుకు కూటమి అభ్యర్థి రేలంగి శ్రీదేవి ఎదురయ్యారు. దీంతో ఆయన ఆప్యాయంగా చెల్లెమ్మా బాగున్నావా అంటూ పలకరించారు. శ్రీదేవి కూడా అన్న య్యా.. ఎలా ఉన్నావ్ అంటూ మాట్లాడారు.
ఫ కూటమి పాలనలో అస్తవ్యస్తం
ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో రూ.కోట్ల వ్యయంతో తాను ఎంపీగా చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపించాలని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలో కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రచారం చేశారు. నగరంలో రహదారులను ఇష్టానుసారం ధ్వంసం చేశారని, ఆరు నెలలుగా ప్రజలు అవస్థలు పడుతున్నారని భరత్ ధ్వజమెత్తారు. దేశ రక్షణకు కృషి చేసిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దాసి వెంకటరావును మేయర్‌గా, పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారాల్లో ఏపీ హెచ్‌బీసీ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, కార్పొరేటర్ అభ్యర్థులు బిల్డర్ చిన్నా, యజ్జరపు శ్రీనివాసరావు, సబ్బారపు నిర్మలారాణి, బొప్పిశెట్టి వందన, మహ్మద్ పర్హీన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ సెంట్రల్ ఎగిక్యూటివ్ కమిటీ సభ్యుడు, ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు. నగరంలో 68వ డివిజన్ సిద్ధార్థ నగర్, అంబేడ్కర్ నగర్ అభ్యర్థి తిరగాటి సరస్వతితో కలసి ప్రచారం చేశారు. మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి సత్యవాణి, పార్టీ నగర ఎస్సీ సెల్ చైర్మన్ తిరగాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధతతో కూడిన పాలన అందిస్తా
ఆర్మీలో క్రమశిక్షణతో ఉద్యోగం చేసానని అదే నిబద్దతతో నగర పాలక సంస్థ మేయర్‌గా విధులు నిర్వహిస్తానని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి దాసి వెంకటరావు ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఉదయాన్నే వాకర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ 45వ డివిజన్ ఇన్‌చార్జి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రేగుళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లాలోని పలుపంచాయతీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది.


