చంద్రబాబు పాలనంతా మోసమే | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనంతా మోసమే

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

ఫ నిత్యావసరాల ధరలు

విపరీతంగా పెంచేశారు

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

వేణుగోపాలకృష్ణ

ఫ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

రాజమహేంద్రవరం రూరల్‌: చంద్రబాబు పాలన అంతా మోసం, మాయేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. 2024 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ సీపీ కంటే రెట్టింపు పథకాలు అందిస్తానని చెప్పి కుర్చీ ఎక్కిన చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కాతేరు గ్రామంలో మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, 62, 63, 64, 65 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులు ఉప్పులూరి (రాము), సిరామి వెంకట లక్ష్మణస్వామి, సాకా సురేష్‌ బాబు, యెజ్జు శ్రీనివాస్‌ (వాసు)తో కలిసి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో సామన్యుడు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదని, 25 కిలోల బియ్యం కొనాలంటే రూ.2 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. పప్పులు, ఉల్లిపాయలు సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండుసార్లు విద్యుత్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచారన్నారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ నెల 26న జరగబోయే నగరపాలకసంస్థ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు, స్థానిక కార్పొరేటర్‌ అభ్యర్థికి రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు మాట్లాడుతూ తనను మేయర్‌గా గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందించడంతో పాటు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పలూరి వీర వెంకట సత్యనారాయణ, ఆచంట కల్యాణ్‌, ఆచంట మారుతీ దేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement