నేత్రపర్వం.. వెంకన్న తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. వెంకన్న తెప్పోత్సవం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

ఆత్రేయపురం: గోవింద.. హరి గోవింద నామస్మరణతో వేంకటేశ్వరుని తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గౌతమీ గోదావరిలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా గౌతమి నదీ తీరానికి తీసుకు వెళ్లారు. ఆలయ అర్చకులు, వేద పండితులు హంస వాహనంపై స్వామివారిని ఉంచి గోదావరి నదిలో విహరింపజేశారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న తిరుమంగై ఆళ్వార్‌కు రెండో రోజు తిరునక్షత్రం సందర్భంగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement