సమస్య వస్తే సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

సమస్య వస్తే సమాచారం ఇవ్వండి

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

రాజమహేంద్రవరం సిటీ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడడంతో జిల్లా పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులు, వర్షాల వలన విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ఏ సమస్య తలెత్తినా తక్షణం తమకు సమాచారం అందించాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కె.తిలక్‌ కుమార్‌ శనివారం విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ తీగలు తెగిపడినా, స్తంభాలు దెబ్బతిన్నా వాటి సమీపానికి వెళ్లకుండా విద్యుత్‌ శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబర్లు, లోడ్‌ మానిటర్‌ సెల్స్‌ ఏర్పాటు చేసి ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచినట్టు ఆయన తెలిపారు.

టోల్‌ ఫ్రీ నంబర్‌ : 1912

లోడ్‌ మోనిటరింగ్‌ సెల్స్‌

టౌన్‌ డివిజన్‌ : 94906 10093

రూరల్‌ డివిజన్‌ : 94931 78874,

నిడదవోలు డివిజన్‌ : 94931 77540,

సర్కిల్‌ ఆఫీస్‌ : 73822 99960,

ఈఈ, రాజమండ్రి టౌన్‌ : 94408 12585,

ఈఈ, రాజమండ్రి రూరల్‌ : 73825 85487

ఈఈ, నిడదవోలు : 94408 12706,

పర్యవేక్షక ఇంజనీర్‌ : 9440812583

జెడ్పీటీసీ 4.. ఎంపీటీసీ 106 నామినేషన్ల తిరస్కరణ

రాజమహేంద్రవరం రూరల్‌: పరిషత్‌ పోరులో కీలకమైన నామినేషన్ల పరిశీలన జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. జెడ్పీటీసీ 4, ఎంపీటీసీ 106 నామినేషన్లను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం నుంచే అభ్యర్థులంతా వచ్చి అధికారుల సమక్షంలో సరిచూసుకుని వెళ్లిపోయారు. మొత్తంగా 21 జెడ్పీటీసీలకు దాఖలైన 166 నామినేషన్లలో నాలుగు తిరస్కరణకు గురికాగా మిగిలిన 162 ఆమోదించారు. జిల్లాలోని 412 ఎంపీటీసీలకు 2,049 నామినేషన్లు వేయగా 106 తిరస్కరించగా 1,943 ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 27న సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు.

● జనసేన తరఫున జెడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం ఆశించిన గంటా స్వరూపదేవి కొవ్వూరు, సీతానగరం నుంచి జెడ్పీటీసీకి నామినేషన్లు వేశారు. అయితే ఆమె ఇటీవలే అర్బన్‌ నుంచి రూరల్‌లోకి ఓటు మార్చుకున్నారనే కారణంతో రెండు నామినేషన్లూ తిరస్కరించారు.

● సీతానగరం స్థానం నుంచి బీఎస్పీ నుంచి నామినేషన్‌ వేసిన గంగిదేశి వీర రాఘవులు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించకపోవడంతో తిరస్కరించారు.

● రాజానగరం స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరఫున అంకం నాగేంద్ర నామినేషన్‌ వేశారు. ఈ స్థానం మహిళలకు రిజర్వ్‌ చేసినప్పటికీ నాగేంద్ర నామినేషన్‌ వేయడంతో తిరస్కరించారు.

పోలవరం జిల్లాకు పులి భయం!

దేవీపట్నం: చిక్కకుండా, దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న పులి మళ్లీ పోలవరం జిల్లాలో అడుగుపెట్టే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 20 రోజుల క్రితం ఈ ప్రాంతంలో సంచరించి, సరిహద్దులోని సీతానగరం మండలంలో గోదావరిని దాటుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు పులి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆ జిల్లాలోని పాపికొండల అభయారణ్యానికి చేరుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement