టీడీపీకి భారీ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాక్‌

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

వైఎస్సార్‌ సీపీలోకి 100 కుటుంబాల చేరిక

గోకవరం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ గోకవరం మండలం కొత్తపల్లిలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి తోట నరసింహం సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ గ్రామ అధ్యక్షుడు కాలేపు నాగ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో దిండి వెంకటేశ్వరరావు, వేముల రాజబాబు, దిండి సూరిబాబు, ముని వెంకట్రావు, దిండి ప్రసాదరావు, దిండి ప్రభాకర్‌రావు, మూత్తా శ్రీనివాసరావు, వేముల చిన సూరిబాబు, ముదిలి శంకర్‌, భవిరిశెట్టి వెంకట్రావు తదితరులు పార్టీలో చేరారు. వీరికి నరసింహం పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని తోట నరసింహం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పాటి రాంబాబు, సీనియర్‌ నాయకులు దాసరి చినబాబు, గుల్లా ఏడుకొండలు, నరాలశెట్టి నర్శయ్య, నున్నం రాంబాబు, కరుటూరి వీర్రాజు, అంబటి అబ్రహం, సమ్మెటి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement