రేపటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా స్థాయి జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక ఎంఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రతినిధులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ పోటీల నిమిత్తం ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. అండర్‌–14, 16 విభాగాల క్రీడాకారులు హాజరు కావాలని, వివరాలకు 99854 65123 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు వీరపవన్‌

కాజులూరు: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు గొల్లపాలేనికి చెందిన డేగల వీరపవన్‌ ఎంపికయ్యాడు. సోమవారం స్థానిక జెడ్పీ హైస్కూల్‌ పీడీ జి.సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 10, 11, 12వ తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో అండర్‌– 19 రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు జరిగాయన్నారు. ఇందులో వీరపవన్‌ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. నవంబరు 20 నుంచి 25వ తేదీ వరకూ ఛండీగఢ్‌ జరిగే జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర టీమ్‌ తరఫున పాల్గొంటాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement