పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలకు జిల్లాలో చేపడుతున్న కార్యాచరణను కలెక్టర్‌ కీర్తి చేకూరి పుష్కరాల ప్రత్యేక అధికారి, పుర పాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌కు వివరించారు. శుక్రవారం అమరావతి నుంచి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొని వారు చేపడుతున్న వసతులు, సదుపాయాలు, ఘాట్ల అభివృద్ధి, పారిశుధ్యం, రవాణా తదితర అంశాలను ముఖ్య కార్యదర్శికి వివరించారు. 80 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో మరుగుదొడ్లు, పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, రోజుకు గరిష్టంగా 2,800 టన్నుల ఘన వ్యర్థాలు వెలువడే అవకాశం ఉన్నందున వాటి నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే జాతీయ రహదారులు, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలతో పాటు స్థానిక రోడ్లను అనుసంధానిస్తూ సమగ్ర రవాణా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ పుష్కరాలకు గిన్నిస్‌ రికార్డు వచ్చేలా నదీ హారతి, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 5100 మీటర్ల మేర తాత్కాలిక ఘాట్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు డిజిటల్‌ ట్విన్‌ టెక్నాలజీ అమలు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రత్యేక అధికారికి

ప్రణాళికను వివరించిన కలెక్టర్‌ కీర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement