ఈ చిత్రంలో యథేచ్ఛగా సంచరిస్తున్న కుక్కలు ఎక్కడివో తెలుసా? రాజమహేంద్రవరంలోని సర్వజనాస్పత్రిలో నిత్యం తారసపడే దృశ్యాలివి. ఈ ఆస్పత్రిలోని ప్రతి వార్డులోనూ వాటి సంచారం సర్వ సాధారణమైపోయింది. వాటిని అదిలించేవారు.. తరిమే వారూ ఎవరూ లేకపోవడం శోచనీయం. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ వార్డులో రోగులు లేదా వారి బంధువులపై దాడి చేస్తాయోనని వారు భీతిల్లుతున్నారు. ఆస్పత్రిలో సుమారు 30 మంది సెక్యూరిటీ గార్డులు, సిబ్బందీ ఉన్నా వాటి సంచారాన్ని కనీసం నియంత్రించలేకపోవడంపై రోగులు పెదవి విరుస్తున్నారు. శుక్రవారం ఆస్పత్రిలో పరిస్థితిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం


