ఏ అందాన్నైనా.. దృశ్యాన్నైనా వాటిపై వెలుగు ప్రసరిస్తేనే చూడగలం. ఆ వెలుగులనిచ్చే దీపానికి శోభనిస్తున్నాయి ప్రమిదలు. వెలుగుల పండగ దీపావళి వస్తోందంటే ప్రతి ఇల్లూ ప్రమిదావనమై దీప కాంతులతో అలరారుతుంది. ఈ ఏటి పండగను మరింత ద్విగుణీకృతం చేసేలా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి ప్రమిదలు. సంప్రదాయ ఎర్రమట్టి ప్రమిద స్థానే నేడు టెర్రాకోటా ప్రమిదలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రాజమహేంద్రవరం నగరంలోని మార్కెట్లలో ఇటువంటి ప్రమిదలను ప్రజలు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం


