ఆగిన పయనం.. జ్ఞాపకం పదిలం | - | Sakshi
Sakshi News home page

ఆగిన పయనం.. జ్ఞాపకం పదిలం

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● కనుమరుగైన ఉత్తరాలు

● గతంలో ఎంతో ప్రాధాన్యం

● రేపు ప్రపంచ తపాలా దినోత్సవం

కొత్తపేట: గతంలో మానవ జీవితంలో ఉత్తరానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేయడానికి ప్రముఖ సాధనంగా మారేది. క్షేమ సమాచారాలు, ఉద్యోగాల తీపి కబురు, అనారోగ్యాలు, అత్యవసర సంగతులు, స్నేహబంధాలు.. ఇవన్నీ ఉత్తరాల ద్వారానే జరిగేవి. నేటి కాలంలో సాంకేతికత పెరిగి, సెల్‌ఫోన్లు రావడంతో ఉత్తరం కనుమరుగైంది. కానీ అది అందించిన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఈ నెల 9న తపాలా దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచి 15 వరకు పోస్టల్‌ శాఖ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా పోస్టల్‌ సేవలు, పథకాలపై ప్రజలకు అవగాహన, సిబ్బందితో ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తారు.

అతి పెద్ద తపాలా వ్యవస్థ

ప్రపంచంలోనే అతి పెద్ద తపాలా వ్యవస్థను కలిగిన దేశాల్లో మన దేశం తొలిస్థానంలో ఉంది. దేశంలో ప్రస్తుతం 1,55,333 పోస్టాఫీసులు ఉన్నాయి. 1764–66 మధ్య కాలంలో బ్రిటీష్‌ అధికారి వారన్‌ హేస్టింగ్స్‌ తపాలా వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెట్టారు. తొలి తపాలా బిళ్లను 1852లో విడుదల చేశారు. 1969 అక్టోబర్‌ 9న టోక్యోలో జరిగిన మహాసభలో యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ స్థాపించారు. ఆరోజును ప్రపంచ తపాలా దినోత్సవంగా పరిగణించాలని నిర్ణయించారు.

సాంకేతిక విప్లవంతో..

సాంకేతిక విప్లవం జోరందుకున్న తరుణంలో నేటి తరానికి ఉత్తరాలంటేనే తెలియని స్థితి ఏర్పడింది. 24 గంటలు స్మార్ట్‌ఫోన్‌లో అరకొర సందేశాలు పంపడంలోనే ఆనందాన్ని వెతుకుతున్న విద్యార్థులు, యువతకు ఈ ఉత్తరాల ఆనందం తెలియదు. గతంలో ఉత్తరాలు, మనియార్డర్లు, ముఖ్యమైన ప్రతాలన్నీ పోస్టులోనే వచ్చాయి. ఇప్పుడు సెల్‌ఫోన్‌ అందుబాటులోకి రావడంతో అవన్నీ మాయమయ్యాయి. ప్రస్తుతం కోర్టు నోటీసులు, బ్యాంకు నోటీసులు, బ్యాంక్‌ల ఏటీఎం కార్డులు, ఆధార్‌కార్డులు, రిజిస్టర్‌ పోస్టులు మాత్రమే తపాలాలో వస్తున్నాయి.

హెడ్‌ పోస్టాఫీసులు 6 (అమలాపురం, రాజోలు, కాకినాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, రామచంద్రపురం)

సబ్‌ పోస్టాఫీసులు 157

బ్రాంచ్‌ పోస్టాఫీసులు 788

మొత్తం 951

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement