ఐదు నెలలుగా జీతాలివ్వకపోతే బతికేదెలా? | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలలుగా జీతాలివ్వకపోతే బతికేదెలా?

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఉద్యోగులు ఎలా బతకాలని జిల్లా సహకార సంఘ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకె సత్యనారాయణ వాపోయారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో నియమితులైన సహకార సంఘాల ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు నిలిపివేశారన్నారు. వెంటనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరుతూ బుధవారం డీసీసీబీ చైర్మన్‌ తుమ్మలబాబు, సీఈవో సురేంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 350కిపైగా ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీతాలు చెల్లించకుంటే యూనియన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్‌ కోనసీమ జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు బి.లీలాకృష్ణ, పోలిశెట్టి ఈశ్వరుడు, కె శ్రీనివాసరాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement