గుండె చప్పుడు కాపాడండి | - | Sakshi
Sakshi News home page

గుండె చప్పుడు కాపాడండి

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

కిర్లంపూడి: కూలికి వెళితే గానీ గడవని కుటుంబానికి తేరుకోని కష్టం వచ్చి పడింది. దాతలు సాయం చేస్తే గానీ బయటపడే దారి కనిపించడం లేదు. మండలంలోని జగపతినగరం గ్రామానికి చెందిన ఆళ్ల రామలక్ష్మికి భర్త, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఒక అమ్మాయికి వివాహం చేశారు. రామలక్ష్మి భర్తకు ఇటీవల పక్షవాతం వచ్చి కాలు, చేయి పనిచేయకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యా డు. కుటుంబాన్ని పోషించే యాజ మాని అనారోగ్యం పాలైనా ఆమె కుంగిపోలేదు తాను కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేది. ఇప్పుడు ఆమెకు కూడా ఆరోగ్య సమస్యలు ఎదురుకావడంతో ఇంటి వద్దనే ఉంటుంది. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఆమె కొడుకు శ్రీనివాస్‌కు మూడు నెలల వయసులో ఆవేశం వస్తుండడంతో స్కానింగ్‌ చేయగా గుండెలో రంధ్రం ఉందని, శాస్త్ర చికిత్స చేయాలని రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో అప్పు చేసి ఆపరేషన్‌ చేయించారు. ఇప్పుడు 14 ఏళ్లు వచ్చిన తర్వాత మళ్లీ అదే సమస్య రావడంతో విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతడికి గుండె సమస్య ఉందని, రూ.10 లక్షలు అవుతాయని అక్కడి వైద్యులు తెలిపారు. దాతలు స్పందించి తమకు ఆదుకోవాలని రామలక్ష్మి కోరుతున్నారు.

14 ఏళ్ల బాలుడికి

గుండె సమస్య

దాతల సాయం కోరుతున్న తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement